శ్రీలీలకు మూడు సర్ ప్రైజ్ ట్రీట్స్

Three surprise treats for SreeleelaThree surprise treats for Sreeleela

జూన్ 14 బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల పుట్టిన రోజు. గత ఏడాది వరకు టాలీవుడ్ లో సుడిగాలి మాదిరి బిజీగా కనిపించిన శ్రీలీల ఆ తర్వాత వరస పరాజయాలతో కాస్త బ్రేక్ తీసుకుని మరోసారి తెలుగులో బిజీ అయ్యింది. మరోపక్క శ్రీలీల బాలీవుడ్ లోను జెండా పాతేందుకు రెడీ అయ్యింది. 

ఈరోజు శ్రీలీల బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల నుంచి సర్ ప్రైజ్ ట్రీట్స్ అందించారు మేకర్స్. టాలీవుడ్ లో శ్రీలీల మూడు క్రేజీ చిత్రాల్లో నటిస్తుంది. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఆ చిత్రంలో శ్రీలీల క్యూట్ గా పక్కింటి అమ్మాయి లుక్ లో కనిపించింది. ఆమె బర్త్ డే సందర్భంగా శ్రీలీల లుక్ వదులుతూ ఆమెకి విషెస్ చెప్పారు మేకర్స్. 

ఇక ఆమె నటిస్తున్న మరో తెలుగు మూవీ మాస్ జాతర. రవితేజ తో రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీలీలకు మాస్ జాతర మేకర్స్ ఆమె లుక్ వదులుతూ బర్త్ డే విషెష్ తెపారు. దానితో పాటుగా మరో క్రేజీ ఫిలిం లెనిన్ నుంచి శ్రీలీల స్పెషల్ కాదు కాదు లంగాఓణిలో ఉన్న బ్యూటిఫుల్ పోస్టర్ ని వదిలారు. అఖిల్ హీరోగా రాబోతున్న లెనిన్ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. లెనిన్ చిత్రం నుంచి శ్రీలీల బ్యూటిఫుల్ ని రిలీజ్ చేసారు మేకర్స్. 

మరి ఈ బర్త్ డే అప్ డేట్స్ తో శ్రీలీల అభిమానులు చాలా హ్యాపీ గా ఉన్నారు. మూడు స్పెషల్ ఫిలిమ్స్ నుంచి మూడు బర్త్ డే సర్ ప్రైజెస్ తో శ్రీలీల కూడా హ్యాపీనే. 

Sreeleela Receives Surprise Birthday Gift From 3 Movies

sreeleela