ఓటీటీ డీల్ తో షేక్ చేస్తోన్న అఖండ 2
Akhanda 2 OTT - Digital Rights in Demand at Record Priceఅఖండ చిత్రం బ్లాక్ బస్టర్ అవడంతో.. దానికి సీక్వెల్ గా రాబోతున్న అఖండ 2 తాండవం చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోను బాలయ్య బర్త్ డే కి వదిలిన అఖండ 2 అమాంతం అంచనాలు పెంచేసింది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న హైలీ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 పై ఇప్పుడు ఓటీటీల కన్ను పడింది.
బాలయ్య నటిస్తున్న వరుస చిత్రాలు థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీలోనూ బిగ్ హిట్ గా నిలుస్తున్నాయి. బాలయ్య రీసెంట్ ఫిలిం డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ ఎంతగా ట్రెండ్ అయ్యిందో అందరూ చూసారు. ఇప్పుడు అఖండ 2 డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ప్రయత్నాలు మొదలు పెట్టింది అని టాక్.
అయితే అఖండ మేకర్స్ మాత్రం 80కోట్లు కోట్ చేశారని తెలుస్తుంది. మరి 80 కోట్లు డిజిటల్ రైట్స్ తో రావడమంటే మాటలు కాదు... బాలకృష్ణ క్రేజ్, ఆయన రేంజ్ ఈ ఓటీటీ డీల్ తోనే అర్ధమవుతుంది అంటూ నందమూరి అభిమానులు కాలర్ ఎగరేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫైనల్ గా అమెజాన్ ప్రైమ్ అఖండ 2 ని ఎంతకు దక్కించుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.
Akhanda 2 creates buzz with big OTT bidding war







































