నాలుగు నెలల్లో అల్లు అర్జున్ నుంచి సర్ ప్రైజ్

Allu Arjun surprise in four monthsAllu Arjun surprise in four months

అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో సినిమా అనౌన్స్ చెయ్యడమే అల్లు అభిమానులకు షాకింగ్ సర్ ప్రైజ్. తనకు ఇండస్ట్రీ హిట్(అలా వైకుంఠపురములో) ఇచ్చిన త్రివిక్రమ్ ని ఆయన చెప్పిన కథ కాదని అల్లు అర్జున్ అట్లీ తో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చెయ్యడమే కాదు.. ఈ నెలలో సెట్ పైకి వెళ్ళబోతున్నారు. 

ఆతర్వాత అల్లు అర్జున్ లైనప్ ఏమిటి, సందీప్ వంగా తో అనుకున్నారు అది కూడా ఉంటుందో, లేదో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో నిర్మాత బన్నీ వాస్ ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ నుంచి మరో నాలుగు నెలల్లో బిగ్ సర్ ప్రైజ్ రాబోతుంది, నాలుగు నెలల్లో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నామంటూ అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేసారు. 

అంతేకాకుండా అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ ఆగిపోయింది అనే వార్తలపై బన్నీ వాస్ క్లారిటీ ఇస్తూ.. వాళ్ళిద్దరికీ ఉన్న అండర్ స్టాండింగ్, వాళ్ళిద్దరికి ఉన్న క్లారిటీ ఎవ్వరికి లేదు, అల్లు అర్జున్-త్రివిక్రమ్ గారు ఏ రోజు చెబితే ఆ రోజు మూవీ స్టార్ట్ చెయ్యడానికి రెడీ అన్నారు. వాళ్లిద్దరూ రెడీ, స్టార్ట్ అని చెబితే మేము స్టార్ట్ చేస్తామని బన్నీ వాస్ బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. 

అదేమిటో చెబితే అరవింద్ గారు తనని చంపేస్తారు అంటూ ఆ సర్ ప్రైజ్ పై విపరీతమైన హైప్ క్రియేట్ చేసారు బన్నీ వాస్. మరి అల్లు అర్జున్ నుంచి రాబోయే ఆ సర్ ప్రైజ్ ఏమిటో అంటూ అల్లు అభిమానులు తెగ ఆత్రుత పడిపోతున్నారు.

Producer Bunny Vasu About Allu Arjun And Trivikram

allu arjun