ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Did Khushi Kapoor kiss Vedang Raina or Orry

ఖుషి- వేదాంగ్ మ‌ధ్య‌లో ఒర్రీ

Did Khushi Kapoor kiss Vedang Raina or Orry

 

జూన్ 8న ఖుషీ కపూర్ త‌న సోద‌రి సోనమ్ కపూర్ 40వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఆ స‌మ‌యంలో ఖుషి ప్రియుడు వేదాంగ్ రైనా అక్క‌డే ఉన్నాడు. ఈ జంట ఏడాది కాలంగా రిలేష‌న్ లో ఉన్నారు. ప్ర‌స్తుతానికి అధికారికంగా వెల్ల‌డించ‌క‌పోయినా.. ఈ జంట రిలేష‌న్ షిప్ గురించి అంద‌రికీ తెలుసు. అనిల్ కపూర్ ముంబై నివాసంలో జరిగిన పార్టీలో ఆ ఇద్ద‌రూ ఒక‌రిని విడిచి ఒక‌రు క‌నిపించ‌లేదు. అందుకు సంబంధించి ఆన్‌లైన్‌లో చాలా వీడియోలు సాక్ష్యంగా నిలిచాయి.

 

 

డేటింగ్ పుకార్ల మధ్య ఇప్పుడు ఓర్హాన్ అవత్రమణి అకా ఓర్రీ ఒక ఫన్నీ ఇన్‌స్టా రీల్ షేర్ చేసాడు. ఈ వీడియోలో వేదాంగ్ ముఖం నిండా ఎర్రటి లిప్ స్టిక్ ముద్ర‌లు క‌నిపిస్తున్నాయి. ఆ ముద్దుల‌న్నీ ఇచ్చింది ఖుషీయేనా?  కాదా! ఎవ‌రైనా చెప్ప‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నిస్తే, దానికి స‌మాధానం వింతైన ఒక ఎక్స్ ప్రెష‌న్. అయితే ఖుషీ అతడిని ముద్దు పెట్టుకోలేదని ఖండించింది. లిప్‌స్టిక్ గుర్తులకు ఓర్రీ సరదాగా తానే కార‌ణ‌మ‌ని అర్థం వ‌చ్చేలా హింట్ ఇచ్చాడు. అత‌డు ధ‌రించిన ఆ బాడీ కూడా సందేహాలు క్రియేట్ చేసింది. ఇది కామెడీకి మించి అని ఇప్పుడు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

 

జూన్ 2న లండన్‌లో వేదాంగ్ తన 25వ పుట్టినరోజును జరుపుకున్న స‌మ‌యంలోను ఖుషీ కపూర్‌, ఒర్రీ సహా స్నేహితులు అత‌డిని చుట్టుముట్టారు. ఖుషి- వేదాంగ్ మ‌ధ్య ఒర్రీ చాలా చేసాడు! అంతకుముందు, బజార్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఖుషీ తన సంబంధం గురించిన పుకార్లపై వివ‌ర‌ణ ఇచ్చింది. ఇది తనకు కొత్త అనుభవం అని, తాను ఇంతకు ముందు పెద్దగా ఆలోచించలేదని వివరించింది. తన వ్యక్తిగత జీవితం కంటే తన పనిపై దృష్టి పెట్టడానికి ప్రాధాన్యతనిస్తాన‌ని అంది. ప్రజల దృష్టిలో ఉండటంతో వచ్చే స‌మ‌స్య‌లు ఇవి అని చెప్పింది. దానికంటే త‌న వృత్తిపై దృష్టి పెడ‌తాన‌ని అంది.

Orry Reel Adds Speculation Vedang and Khushi dating rumours

vedang and khushi dating