ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tata Group announces ₹1 cr ex-gratia for kin of Air India crash victims

ఎయిరిండియా మృతులకు ఎక్స్‌గ్రేషియా

అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కుప్పకూలిన ఎయిరిండియా ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు టాటా గ్రూప్ భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఎయిరిండియా ఫ్లైట్ యాక్సిడెంట్ లో మృతి చెందిన ఒక్కొక్కరికి బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించడమే కాదు, బీజే మెడికల్‌ కాలేజ్‌ హాస్టల్‌ భవనాన్ని పునర్నిర్మిస్తామని టాటా గ్రూప్ ప్రకటించింది 

ఎయిరిండియాను నిర్వహిస్తున్న టాటా గ్రూప్ ఈ ప్రమాదంలో గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చులను పూర్తిగా టాటా గ్రూప్ భరించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ గురువారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు ఈ ప్రమాద ఘటన నుంచి ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని అహ్మదాబాద్ నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. 11ఏ సీటు ప్రయాణికుడు రమేశ్ ఈ ప్రమాదం నుంచి బయటపడగా ఆయనకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని వివరించారు. 

Travel industry mourns Air India plane crash, sentiment turns sombre

Tata Group announces ₹1 cr ex-gratia for kin of Air India crash victims
tata group