ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Shilpa Shetty latest photoshoot goes viral

50ఏజ్‌లోను శిల్పాశెట్టి షాకిస్తోందిగా

Shilpa Shetty latest photoshoot goes viral

వ‌య‌సు మీద ప‌డుతున్నా అందం త‌ర‌గ‌డం లేదు. 50 ఏజ్ లోను ఇంకా సిక్స్ టీన్ ప్రాయం ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రు ఈ బ్యూటీ? అంటే.. సాగ‌ర‌క‌న్య శిల్పా శెట్టి గురించే ఇదంతా. ఈ భామ బాలీవుడ్, టాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించింది. వ్యాపార‌వేత్త‌, సినీనిర్మాత రాజ్ కుంద్రాను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట ఇటీవ‌ల‌ కొన్ని వివాదాల కార‌ణంగా మీడియా హైలైట్ అయినా ఇప్పుడు ప్ర‌శాంత జీవితాన్ని ఆస్వాధిస్తున్నారు.

శిల్పా శెట్టి లేట్ ఏజ్ లోను 20ఏజ్ బ్యూటీలా అదే ఛ‌రిష్మాతో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. త‌న‌ వ్యాయామ దిన‌చ‌ర్య‌, యోగా, మెడిటేష‌న్ వంటి సెష‌న్స్ కి సంబంధించిన ఫోటోల‌ను సోషల్ మీడియాల‌లో షేర్ చేస్తూ, భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది. 50 వ‌య‌సులో శిల్పా శెట్టి న‌వ‌య‌వ్వ‌న రూపంతో మెరిసిపోతున్న ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు ఇంట‌ర్న‌ట్ లో వైర‌ల్ గా మారాయి. 

తెలుపు రంగు టాప్, కాంబినేష‌న్ బాట‌మ్ తో శిల్పా శెట్టి ఎంతో అందంగా క‌నిపిస్తోంది. శిల్పా శెట్టి బుల్లితెర‌పై డ్యాన్స్ రియాలిటీ షోల జ‌డ్జిగా ప్ర‌జ‌ల‌ను అల‌రిస్తోంది. మ‌రోవైపు ఛాలెంజింగ్ రోల్ లో ఆఫ‌ర్ వ‌స్తే పెద్ద తెర కోసం న‌టిస్తోంది. 

Shilpa Shetty Flaunts Curvy figure in white outfit

shilpa shetty