ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Did Rashmika Mandanna Disregard Kannada

కన్నడ ను మరోసారి కెలికిన రష్మిక

రష్మిక గతంలో రిషబ్ శెట్టి విషయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. అప్పట్లో రష్మిక ను కన్నడ నుంచి బ్యాన్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఆమె నటించిన మొదటి సినిమా కిర్రాక్ పార్టీ విషయంలో రష్మిక పదే పదే ఆ టీమ్ ని కెలకడం సెన్సేషన్ కాదు రష్మిక పై కన్నడిగులు ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. 

తాజాగా మరోసారి రష్మిక కన్నడీగులను కెలికింది. రీసెంట్ గా కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల పట్ల కన్నడ ప్రజలు ఎంతగా ఆగ్రహం వ్యక్తం చేసారో, కమల్ ను మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఇప్పడు రష్మిక తను నటించిన కుబేరా ఈవెంట్ కోసం చెన్నై వెళ్ళింది. ఆ తర్వాత ఆమె సినిమా గురించి మాట్లాడకుండా నేను చెన్నై లో ఉన్నాను, మొదట తమిళమే నేర్చుకున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి  కన్నడ వాసుల ఆగ్రహానికి గురయ్యింది. 

సోషల్ మీడియాలో కుబేర ఈవెంట్ ఫొటోస్ షేర్ చేస్తూ.. చెన్నైలోనే తన బాల్యం గడిచింది, అందుకే చెన్నై కి తన హృదయంలో ప్రత్యేక స్థానముందని రాసుకొచ్చింది. తన తండ్రి ఉద్యోగ రీత్యా తాము చెన్నైలోనే నివసించాము, ఇక్కడి ఓ స్కూల్‌లో చదువుకున్నానని, ఆ తర్వాతే తాము కూర్గ్‌కు మకాం మార్చామని చెప్పిన రష్మిక ఒకరకంగా తాను నేర్చుకున్న మొదటి భాష తమిళమేనని రష్మిక పేర్కొంది.

అదే ఇప్పుడు కన్నడీగుల ఆగ్రహానికి కారణమైంది. విరాజ్‌పేటలో పుట్టిన నువ్వు, గొనికొప్పల్‌లోని కూర్గ్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న నువ్వు మొదట నేర్చుకున్న భాష తమిళమా.. అంటూ కన్నడ అభిమానులు రష్మికపై మండిపడుతున్నారు. 

Rashmika Mandanna

Did Rashmika Mandanna Disregard Kannada
rashmika