ప్రతిపక్షాలకు అందని అక్కినేని ఆహ్వానం
Akkineni invitation not received by opposition partiesకింగ్ నాగార్జున అద్భుతమైన నటుడే కాదు అంతకుమించిన బిజినెస్ మ్యాన్ కూడా. అందుకే అధికారం వెంటే నాగ్ పరుగులు పెడుతూ ఉంటారు. దానికి ఉదాహరణే.. చిన్న కొడుకు అఖిల్ పెళ్ళికి అధికార పక్ష నాయకులను ఆహ్వానించి ప్రతిపక్షాలకు ఆహ్వానించకపోవడం అంటూ నెటిజెన్స్ గుసగుసలాడుకుంటున్నారు.
రీసెంట్ గా నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ వివాహాన్ని తన ఇంట్లోనే జైనబ్ తో సింపుల్ గా జరిపించినప్పటికీ వెడ్డింగ్ రిసెప్షన్ ని మాత్రం ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. అఖిల్ పెళ్లి కి ఏపీ సీఎం చంద్రబాబు సహా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మిగతా మంత్రులను ఆహ్వానించారు. అధికారంలో ఉన్ననేతలతో సన్నిహితంగా ఉండడంలో తప్పు లేదు. గత ప్రభుత్వాల్లో జగన్ తనకు స్నేహితుడు అని చెప్పిన నాగార్జున జగన్ ను అఖిల్ రిసెప్షన్ కి పిలవలేదా, పిలిస్తే రాలేదా.
అంతేకాదు తెలంగాణాలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్ లతో సన్నిహిత సంబంధాలు కలిగిన నాగార్జున ఇప్పడు వారిని చిన్న కొడుకు అఖిల్ రిసెప్షన్ కి ఆహ్వానించకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే నాగార్జున అఖిల్ పెళ్లి విషయంలో ఎలాంటి లీక్స్ లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు, అందులో భాగంగానే జగన్, కేటీఆర్ లాంటి వాళ్ళు హాజరయినా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారా, మొదట్లోనే నాగార్జున గనక జగన్, కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళను ఆహ్వానించిన విషయమే వైరల్ అయ్యేది.
అదేమీ లేదు అంటే నాగార్జున రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులను పిలవలేదా, అఖిల్ పెళ్లికి రావాల్సినంత మంది సినీప్రముఖులు, రాజకీయ నేతలు రాలేదు అనే విషయంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.
Celebrities at Akhil-Zainab wedding reception







































