హేమ కమిటీ సిఫార్సులు వృథాయేనా
Negligence on Hema Committee reportమలయాళ చిత్రసీమలో లైంగిక వేధింపులు సహా సెట్స్ లో మహిళల అసౌకర్యాలపై వందల పేజీల రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది హేమ కమిటీ. కానీ సమస్యలకు పరిష్కారం వెతకడంలో కేరళ పినరయి ప్రభుత్వం చొరవ చూపడం లేదని, ఈ నివేదికను పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శించారు నటి పార్వతి తిరుమోతు.
మాలీవుడ్ లో పలు క్రమశిక్షణా సంఘాల్లో యాక్టివ్ గా ఉన్న పార్వతి నిరంతరం ప్రభుత్వం తీరుతెన్నులను, సినీపెద్దల గూడుపుటానీ గేమ్స్ ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. పార్వతి ప్రశ్నలకు మాలీవుడ్ సినీపెద్దలందరికీ గూబ గుయ్ మంటుంది. అందుకే ఈ భామ అంటే మాలీవుడ్ పెద్దలందరికీ హడల్. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తున్న లైంగిక వేధింపుల కేసులన్నిటినీ ఎత్తేస్తున్నారని తెలియగానే మరోసారి పార్వతి తనదైన శైలిలో విరుచుకపడింది. పినరయి ప్రభుత్వం లైట్ తీస్కుంది అనే అర్థం వచ్చేలా ఇన్ స్టాలో ఒక పోస్ట్ ని పార్వతి షేర్ చేసింది. హేమ కమిటీ నివేదికను సమర్పించి ఐదేళ్లే కదా అయింది! అంటూ విమర్శనాత్మకంగా ప్రశ్నించారు పార్వతి. మాలీవుడ్ లో మహిళల సమస్యల్ని పరిష్కరించేందుకు పినరయి ప్రభుత్వం చురుగ్గా స్పందించలేదని విమర్శించారు.
అయితే కేసులు విత్ డ్రా చేసుకోవాలనుకోవడం అర్థం చేసుకోగలం.. ఇప్పటికీ బాధితులు చాలామంది కేసులతో ముందుకు వెళతారని భావిస్తున్నట్టు సంబంధిత క్రమశిక్షణా నియమావళికి సంబంధించిన కమిటీ సభ్యులు పార్వతికి కౌంటర్ ఇస్తున్నారు.
Explanation needed for neglecting Hema Committee report







































