Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> =Kannappa: Brahmin Associations On Fire

కన్నప్ప విడుదల కాలేదు.. అప్పుడే ధర్నాలు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ నెల 27 న విడుదలకు సిద్దమవుతుంది. మంచు విష్ణు కొన్నాళ్లుగా కన్నప్ప పై అంచనాలు పెంచుతూ ఇంటర్వూస్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా అంటే ఈరోజు సాయంత్రం కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గుంటూరు లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. కన్నప్ప విడుదల పదే పదే వాయిదా పడుతూ చివరికి జూన్ 27 విడుదల ఫిక్స్ చేసుకుంది. 

అయితే సినిమా విడుదల కాకముందే కన్నప్ప చిత్రం వివాదాల్లో ఇరుక్కుంది. వినడానికి విచిత్రమే అయినా.. కన్నప్ప చిత్రంలోని పిలక, గిలక అనే పాత్రలు బ్రాహ్మణులను అవమానించేలా ఉన్నాయంటూ బ్రాహ్మణ సంఘాలు కన్నప్ప చిత్రం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అప్పుడే ధర్నాలు, నిరసనలు కూడా స్టార్ట్ చేసారు వారు. 

ఈరోజు శుక్రవారం విజయవాడ శంకర్ విలాస్ సెంటర్‌లో బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకం చేసి తమ బ్రాహ్మణులు ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేకాకుండా మంచు ఫ్యామిలీ కొద్దిరోజులుగా బ్రాహ్మణులను కించపరిచేలా వ్యవహరిస్తోందని, ఇపుడు కన్నప్ప సినిమాలో ఉద్దేశపూర్వకంగానే పిలక, గిలక అనే పాత్రలను సృష్టించి బ్రాహ్మణులను అవమానిస్తున్నారు. 

రీసెంట్ గా విడుదల చేసిన ఈ రెండు పాత్రలు బ్రాహ్మణులను కించపరిచేందుకే పెట్టారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ మంచు విష్ణు కన్నప్ప పై ఫైర్ అవుతున్నారు. 

Kannappa Movie Sparks Controversy in Vijayawada

=Kannappa: Brahmin Associations On Fire
kannappa