నిన్న కొడుకు పెళ్లి - ఈరోజు కుబేర డబ్బింగ్

Nagarjuna Wraps Dubbing Of KuberaaNagarjuna Wraps Dubbing Of Kuberaa

జూన్ 6 తెల్లవారుఝామున కింగ్ నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ వివాహాన్ని అంగరంగ వైభవంగా నాగార్జున తన ఇంట్లోనే పూర్తి చేసారు. గత మూడు రోజులుగా నాగార్జున చిన్న కొడుకు పెళ్లి వేడుకల్లో మునిగిపోయారు. రేపు అంటే ఆదివారం హైదరాబాద్ లో అఖిల్ రిసెప్షన్ జరగనుంది. ఈలోపే నాగార్జున మరో పని పూర్తి చేసేసారు. 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కలయికలో హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్రం కుబేర. కుబేర మూవీ జూన్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషనల్ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే చెన్నై లో ఆడియన్స్ లాంచ్ ని మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. 

తాజాగా కింగ్ నాగార్జున కుబేరకు తన పాత్ర కు సంబందించిన డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, శేఖర్ కమ్ముల, నిర్మాత పుష్కర్ రామోహన్ కలసి మాట్లాడుతున్న ఫోటోలని మేకర్స్ షేర్ చేశారు. నిన్న చిన్న కొడుకు అఖిల్ పెళ్ళిలో హడావిడి చేసిన నాగార్జున ఈరోజు కుబేర డబ్బింగ్ పూర్తి చెయ్యడం తో నాగార్జున డెడికేషన్ ని మెచ్చుకోవలసిందే అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. . 

రేపు అఖిల్-జైనబ్ ల రిసెప్షన్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. కుబేర తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Nagarjuna Wraps Dubbing For Sekhar Kammula Kuberaa

nagarjuna