Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha dropped pictures of her recent vacation to Abu Dhabi

పాత జ్ఞాపకాలను చెరిపేస్తున్న సమంత

Samantha dropped pictures of her recent vacation to Abu Dhabi

సమంత గతంలో హీరో సిద్దార్థ్ ని ప్రేమించింది. ఆతర్వాత సిద్దార్థ్ తో విభేదాలు రావటంతో ఆ లవ్ ని బ్రేకప్ చేసుకున్న సమంత కొద్దిరోజులు సింగిల్ గా కనిపించినా, హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడి ఆ ప్రేమను సీక్రెట్ గా దాచేసి.. ఫైనల్ గా పెళ్లి పీటలెక్కింది. చైతు తో ప్రేమలో పడ్డాక సమంత తన ఒంటిపై చై జ్ఞాపకంగా టాటూస్ వేయించుకుంది. 

చైతు తో ప్రేమ, పెళ్లి అన్ని బ్రేకప్ అయ్యి విడాకులు తీసుకున్న సమంత ఆతర్వాత తన ఒంటిపై ఉన్న టాటూస్ ని ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తుంది. గతంలో నడుం పై ఉన్న టాటూ ని చెరిపేసిన సమంత ఇప్పుడు మెడ కింద వేయించిన టాటూని చెరిపేసింది. అటు చైతు కూడా శోభిత ను వివాహం చేసుకుని సెటిల్ అయ్యాడు, సమంత కూడా రాజ్ నిడమోరు తో డేటింగ్ లో ఉంది అనే రూమర్స్ ఉన్నాయి. 

ఇప్పుడు హైదరాబాద్ లో తన మాజీ మరిది అఖిల్ పెళ్లి జరుగుతున్న సమయంలో సమంత అబుదాబి లో ఎంజాయ్ చేస్తుంది. దుబాయ్ లో ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి వెళ్లిన సమంత కొద్దిరోజులపాటు అబుదాబిలో సేద తీరుతుంది. అదే సమయంలో ఆమె టాటూ ని తొలగించిన పిక్స్ వైరల్ అవడంతో.. పాత జ్ఞాపకాలను చెరిపేస్తున్న సమంత అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. 

Samantha makes a quick pit stop at Abu Dhabi to enjoy a desert holiday

samantha