సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష తప్పిదాలు
Trisha Role In Thug Life Criticized Heavilyపొన్నియన్ సెల్వన్ తో సెకండ్ ఇన్నింగ్స్ లో క్రేజీ నటిగా మారిన త్రిష ఆతర్వాత ఒక్కసారిగా స్టార్ హీరోల అవకాశాలతో ఉక్కిరిబిక్కిరైంది. విజయ్, అజిత్, కమల్ హాసన్, ఇక్కడ మెగాస్టార్ ఇలా వరసగా స్టార్ హీరోల అవకాశాలు వచ్చేసరికి ఆమె కథలను ఎంపిక చేసుకోవడంతో తడబడిందా అనేలా ఆమె లేటెస్ట్ చిత్రాల రిజల్ట్ ఉంటుంది.
మొన్నటికి మొన్న గుడ్ బ్యాడ్ అగ్లీ లో త్రిష కేరెక్టర్ ఎవ్వరికి నచ్చలేదు, ఆ చిత్రం తమిళనాట తప్ప ఎక్కడా ఆడలేదు. ఇప్పడు కమల్ హాసన్-మణిరత్నం చిత్రం థగ్ లైఫ్ లో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో త్రిష కేరెక్టర్ చూసి ఆమె అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. త్రిష రోల్ మాత్రమే కాకుండా ఆమెతో ఉన్న పలు సన్నివేశాలు, ఇతర పాత్రలతో ఉన్న సంబంధాలు చూసి ఆడియెన్స్ కి వెగటు కలిగింది అంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
థగ్ లైఫ్ లో త్రిషకు నటించే స్కోప్ దొరకలేదు. అసలు త్రిష కేరెక్టర్ లేకపోయినా ఎవ్వరు ఫీలయ్యేవారు కాదు అనే అభిప్రాయాన్ని ఆడియన్స్ వ్యక్తం చేస్తున్నారు. త్రిష క్యారెక్టర్ కిచ్చిన ఎండింగ్ చూశాక త్రిష ఇలాంటి స్క్రిప్ట్ ఎందుకు ఒప్పుకుందో అర్ధం కాక ఆమె అభిమానులు తల పట్టుకుంటున్నారు.
ఇదే మణిరత్నం త్రిషను పొన్నియిన్ సెల్వన్ లో ఎంతో అందంగా చూపించారు, కానీ థగ్ లైఫ్ లో ఇంత చెత్తగా చూపించడాన్ని ఆమె అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అవన్నీ చూసే త్రిష స్టార్ హీరోల అవకాశం వస్తే చాలు, కథతో పని లేదు అన్నట్టుగా సెకండ్ ఇన్నింగ్స్ లో స్క్రిప్ట్ ఎంపికలో తప్పిదాలు చేస్తుంది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
Thug Life - Trisha gets trolled for her silly role







































