క్యూట్ క్యూట్ శ్రీలీల

Sreeleela new look goes viralSreeleela new look goes viral

శ్రీలీల ఈమధ్యన పుట్టిన రోజు వేడుకలతో తెగ హైలెట్ అయ్యింది. పెళ్లి కూతురు వలె శ్రీలీలను ముస్తాబు చేసి, పూజలు పునస్కారాలు చేయించి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా చేసారు కుటుంబ సభ్యులు. ఆ బర్త్ డే వేడుకలు పెళ్లి వేడుకల ఓ రేంజ్లో జరగడంతో అందరూ షాకైపోయారు. ప్రస్తుతం బాలీవుడ్ లో శ్రీలీల హడావిడి మాములుగా లేదు. 

కార్తీక్ ఆర్యన్ తో జోడి కట్టిన శ్రీలీల అక్కడ మరో ప్రాజెక్ట్ ఓకె చేసింది అనే టాక్ నడుస్తుంది. మరోపక్క కోలీవుడ్ లో శ్రీలీల శివ కార్తికేయన్ పరాశక్తిలో నటిస్తుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే రవితేజ తో మాస్ జాతర లో క్రేజీగా నటిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోస్ వదిలే శ్రీలీల తాజాగా క్యూట్ పిక్స్ షేర్ చేసింది. 

మోడ్రెన్ అవుట్ ఫిట్ లో మత్తెక్కించే చూపులతో శ్రీలీల లేటెస్ట్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా శ్రీలీల న్యూ పిక్స్ పై ఓ లుక్ వెయ్యండి.  

Sreeleela latest look viral

sreeleela