హరీష్ నెత్తిన పాలుపోసిన పవన్
Pawan Ustaad Bhagat Singh shoot to resume in second week of Juneనిజమే మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తీసిన హరీష్ శంకర్ తన తదుపరి సినిమా ఎంత మంచి స్క్రిప్ట్ తీసుకుని హీరోలు చుట్టూ తిరిగినా ఆయనకి ఏ స్టార్ హీరో కూడా అవకాశమివ్వరు, ఆఖరికి రామ్ తో కమిట్ అయిన మూవీ కూడా హరీష్ శంకర్ కి ఉంటుందో, లేదో అనుకుంటున్న సమయంలో హరీష్ శంకర్ నెత్తిన పవన్ కళ్యాణ్ పాలు పోశారు. వీరి కాంబోలో రాజకీయాలతో ఆగిన ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ మొదలవుతుంది.
గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన కొద్దిపాటి డేట్స్ వాడే ది బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చిన హరీష్ శంకర్ పై పవన్ ఫ్యాన్స్ లో నమ్మకం ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్, పవన్ పోలీస్ లుక్ అన్ని ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేసాయి. పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ తో ఉస్తాద్ భగత్ సింగ్ ని పక్కనపెట్టారు, ఆ చిత్రం ఆగిపోతుంది అనుకున్న తరుణంలోనే పవన్ తిరిగి డేట్స్ ఇచ్చారు.
జూన్ రెండో వారం నుంచి ఉస్తాద్ భగత్ సంగ్ తిరిగి సెట్ పైకి వెళుతోంది. ఒకవేళ పవన్ గనక తిరిగి రాకపోతే హరిష్ శంకర్ పరిసితి ఏమిటి, హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కి బెస్ట్ ఇస్తే ఆటోమాటిక్ గా బ్యాక్ బౌన్స్ అవుతారు. సో ఆ లెక్కన పవన్ హరీష్ శంకర్ నెత్తిన పాలు పోసినట్టేగా.
Ustaad Bhagat Singh update







































