ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Akhil Akkineni ties the knot with Zainab Ravdjee

గ్రాండ్ గా అఖిల్-జైనాబ్ ల పెళ్లి జరిగిపించిన నాగ్

Akhil Akkineni ties the knot with Zainab RavdjeeAkhil Akkineni ties the knot with Zainab Ravdjee

అక్కినేని ప్రిన్స్ అఖిల్ పెళ్లయిపోయింది. తను ప్రేమించిన అమ్మాయి జైనాబ్ మెడలో అఖిల్ మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచాడు. ఈరోజు జూన్ 6 తెల్లారిజామున 3 గంటలకు జరిగిన అఖిల్ అక్కినేని, జైనాబ్ ల వివాహాన్ని అక్కినేని నాగార్జున జూబ్లీ హిల్స్ లోని అక్కినేని హౌస్ లో అంగరంగ వైభవంగా జరిపించారు. 

అఖిల్ వివాహానికి సినిమా ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, రామ్ చరణ్, ఉపాసన దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంకా కొంతమంది ప్రముఖులు అఖిల్-జైనాబ్ ల వివాహానికి హాజరయ్యారు.  

అయితే జూన్ 8 ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియో లో జరిగే రిసెప్షన్ కి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, టాలీవుడ్ టాప్ స్టార్స్, బడా రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు. కింగ్ నాగార్జున ప్రతి ఒక్కరికి పేరుపేరునా అఖిల్ వెడ్డింగ్ కార్డు అందించి వెడ్డింగ్ రిసెప్షన్ కి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇక ఆదివారం జరిగే రిసెప్షన్ ను భారీ లెవల్ లో అక్కినేని ఫ్యామిలీ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

Akkineni Akhil ties knot with Zainab

akhil