Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> One movie is the tension for all three of them

ఒక్క సినిమా ఆ ముగ్గ‌రికి టెన్ష‌న్

జూన్ 12 నుంచి `హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు` ఎగ్జిట్ అయిన సంగ‌తి తెలిసిందే. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యం కార‌ణం గా రిలీజ్ ను మ‌రోసారి వాయిదా వేసారు. దీంతో కొత్త రిలీజ్ తేదీ ఎప్పుడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. జులైలో రిలీజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని గ‌ట్టిగానే వినిపిస్తుంది. అయితే తేదీపై మాత్రం క్లారిటీ లేదు. జులై తొలి వారంలో రిలీజ్ లేకుంటే ప‌ర్వాలేదు. లేదంటే? ప‌వ‌న్ కార‌ణంగా మిగ‌తా సినిమా హీరోలు టెన్ష‌న్ పడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.

జులై తొలి వారంలో4న విజ‌య్ దేవ‌ర‌కొండ `కింగ్ డ‌మ్` రిలీజ్ అవుతుంది. ఈసినిమా కూడా ప‌లు వాయిదాల త‌ర్వాత రిలీజ్ అవుతుంది. ఈ తేదీకి ఎట్టి ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజున పీకే బ‌రిలోకి దిగితే మాత్రం `కింగ్ డ‌మ్` డేరింగ్ చేయాలి?  లేదా?  వాయిదా వేసుకోవాలి. అదే రోజున యూత్ స్టార్ నితిన్ న‌టించిన `త‌మ్ముడు` కూడా రిలీజ్ డేట్ పిక్స్ చేసుకుంది.

ప‌వ‌న్ కి  నితిన్ వీరాభిమాని. అన్న‌య్య‌గా చూస్తాడు. వ్య‌క్తిగ‌తంగా ఇద్ద‌రి మ‌ధ్య మంచి  సాన్నిహిత్యం ఉంది. అలాంటి అన్న‌య్య సినిమా త‌మ్ముడు ఎందుకు పోటీగా వ‌స్తాడు. కాబ‌ట్టి త‌మ్ముడు వెన‌క్కి త‌గ్గుతాడు. మ‌రుస‌టి వారం జులై 11న అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న `ఘాటీ` రిలీజ్ అవు తుంది. ఈసినిమా స‌క్సెస్ అనుష్కకి అత్యం కీల‌కం. సోలోగా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటాల‌ని చేస్తోన్న మ‌రో ప్ర‌య‌త్నం.

`అరుంధ‌తి` త‌ర్వాత ఆ రేంజ్ స‌క్స‌స్ ప‌డ‌లేదు. సోలో గా చేసిన చాలా ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్టాయి. పైగా ప్ర‌స్తుతం హీరోయిన్ గా అవ‌కాశాలు కూడా రాలేదు. ఈ నేప‌థ్యంలో ఘాటీ రిలీజ్ అమ్మ‌డికి కీల‌కంగా మారింది. అదే రోజు గ‌నుక వీరమ‌ల్లు రిలీజ్ తేదీగా ప్ర‌కటిస్తే అనుష్క వెన‌క్కి త‌గ్గుతుంది. త‌మ తేదీల్లో వీర‌మ‌ల్లు రాకూడ‌దంటూ ఆయా చిత్ర యూనిట్ లు కోరుకుం టున్నాయి. మ‌రి ప‌వ‌న్ ఏమ‌ను కుంటున్నారో ఆ పెరుమాళ్ల‌కే ఎరుక‌.

Dark clouds loom over the release of Hari Hara Veera Mallu

One movie is the tension for all three of them
hari hara veera mallu