దానికి బ్రేక్ ఇస్తున్న శోభా శెట్టి

Shobha Shetty Quits Social Media

కన్నడ నటి, సీరియల్ యాక్ట్రెస్ శోభా శెట్టి కార్తీక దీపం సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యింది. శోభా శెట్టి కన్నా కార్తీక దీపంలో ఆమె చేసిన విలన్ కేరెక్టర్ మోనిత గా బుల్లితెర ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఆతరవాత ఆమె తెలుగు బిగ్ బాస్ 7 లో కనిపించింది. ఆమె నోరు ఆమెను ఆ షోలో హైలెట్ అయ్యేలా చేసింది. 

తెలుగు బిగ్ బాస్ కి వెళ్లిన శోభా శెట్టి ని చాలామంది ఆడియన్స్ ఇష్టపడలేదు. ఆమెపై నెగిటివిటి పెరిగింది. ఆమె బిహేవియర్ కి హౌస్ మేట్స్ మాత్రమే కాదు, బుల్లితెర ఆడియన్స్ కు కూడా విసుగొచ్చింది. ఆ బిగ్ బాస్ స్టేజ్ పై ఆమె ప్రియుడిని పరిచయం చేసింది. అతను సీరియల్ నటుడే. కార్తీక దీపంలోనే నటించిన యాశ్వంత్ ని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఎంగేజ్మెంట్ అయ్యి ఏడాది అయ్యింది. పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. 

గత ఏడాది శోభా శెట్టి కన్నడ బిగ్ బాస్ కి వెళ్ళింది. ఆ షో నుంచి అనారోగ్య కారణాలతో బయటికొచ్చిన శోభా శెట్టి తాజాగా సోషల్ మీడియాకి బ్రేకిస్తున్నట్టుగా చెప్పింది, తను కొద్దిరోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టుగా ఇన్స్టా లో చెప్పుకొచ్చింది, మరి శోభా శెట్టికి ఏమైందో ఏమో సోషల్ మీడియాకి బ్రేకిచ్చింది అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. 

Shobha Shetty Quits Social Media Due To This Reason

shobha shetty