ప్రముఖ నటుడిని పట్టి పీడిస్తున్న బొమ్మాళీ
Pankaj Tripathi reveals he is not part of Thug Lifeవిశ్వనటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ ఈ గురువారం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత కమల్- మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా భారీ హైప్, వివాదాల నడుమ దేశవిదేశాల్లో విడుదలవుతోంది. ఈ చిత్రంలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. చాలా కాలంగా బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ఈ చిత్రంలో నటించారని ఊహాగానాలు ఉన్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో పంకజ్ దీనిని తోసిపుచ్చారు.
జాతీయ మీడియా ఇంటర్వ్యూలో పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ ఊహాగానాలేవీ నిజాలు కాదని అన్నారు. కేవలం అంతర్జాలంలో పుట్టుకొచ్చిన కల్పిత పుకార్. థగ్ లైఫ్‌లో ఏ పాత్రను పోషించలేదు అని తెలిపారు. భాష ప్రధాన సమస్య. నటుడికి భాష పరంగా సౌలభ్యం ఉండాలి. నేను ఒకప్పుడు తెలుగు సినిమాలో నటించాలని ప్రయత్నించినప్పుడు కనీసం ఏబీసీడీలు కూడా సరిగా చెప్పలేకపోయాను.
నేను మాట్లాడే లైన్లు అయినా నేను అర్థం చేసుకుంటేనే సౌకర్యంగా నటించగలను. సహజ నటనను రాబట్టాలంటే భాషతో సమస్య ఉండకూడదు. అందుకే హిందీ భాషలో మాత్రమే నటిస్తున్నాను అని తెలిపారు. పంకజ్ పలు హిందీ వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటించాడు. మీర్జాపూర్, స్పెషల్ ఓపిఎస్ వంటి సిరీస్ లతో అతడికి మంచి పేరొచ్చింది. భాష సరిహద్దులు చెరిగిపోయిన ఈ రోజుల్లో, అతడు సౌత్ లోను నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Pankaj Tripathi called the rumours false







































