Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha wore a stunning golden saree at a jewellery brand launch

దుబాయ్ లో సమంత హడావిడి

Samantha wore a stunning golden saree at a jewellery brand launch

కొద్దిరోజులుగా సమంత పై వస్తోన్న సెకండ్ మ్యారేజ్ రూమర్స్ నేపథ్యంలో సమంత దుబాయ్ లో ఓ అవార్డు వేడుకలో హడావిడి చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. దర్శకుడు రాజ్ నిడమోరు తో సమంత డేటింగ్ లో ఉంది, అందుకే అప్పుడప్పుడు రాజ్ తో కలిసి ఉన్న పిక్స్ పోస్ట్ చేస్తూ రెండో పెళ్లి పై హింట్స్ ఇస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. 

మరోవైపు వీరి విషయంలో రాజ్ నిడమోరు భార్య శ్యామలీ ఇండైరెక్ట్ పోస్ట్ లు అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి తప్ప సమంత-రాజ్ నిడమోరు బంధంపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే సమంత తాజాగా దుబాయ్ లో ఓ జ్యువెలరీ షాప్ వేడుకలో సందడి చేసిన పిక్స్ ని పోస్ట్ చేసింది. 

సమంత నవ్వుతూ సరదాగా డిజైనర్ వేర్ శారీ లో సెక్సీగా కనిపించడమే కాదు, అక్కడికొచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేసింది. అయితే సమంత ఈమధ్యన మరీ సన్నగా నాజూగ్గా కనిపించినా ఆమె లోని ఆకర్షణ మాయమైంది అనే మాట వినబడుతుంది, ఆమె నిర్మించిన శుభం ఈవెంట్స్ లోను సమంత చాలా సన్నగా కనిపించిన విషయం తెలిసిందే.

Samantha Ruth Prabhu Radiates Elegance In Gold At Dubai Jewellery Launch

samantha