కింగ్ డమ్ ని వదలని వీరమల్లు

Hari Hara Veera Mallu Postponed

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ని వీరమల్లు వదలదా..  అప్పట్లో 30 మే న కింగ్ డమ్ అంటే హరి హర వీరమల్లు కూడా మే 30 న రావొచ్చనే ఊహాగానాలు ఒక కారణమైతే ఇంకాస్త పనులు పెండింగ్ ఉండడంతో కింగ్ డమ్ ని జులై 4 కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆతర్వాత హరి హర వీరమల్లు కూడా జూన్ 12 న రిలీజ్ అన్నారు. హమ్మయ్య వీరమల్లు , కింగ్ డమ్ క్లాష్ అవ్వదులే అనుకున్నారు.

కానీ కింగ్ డమ్ ని వీరమల్లు ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు. కారణం హరి హర వీరమల్లు జూన్ 12 నుంచి పోస్ట్ పోన్ అవ్వచ్చోనే ఊహాగానాలు మొదలయ్యాయి. హరి హర వీరమల్లు పనులు ఇంకేమి పూర్తవ్వని కారణంగా, అలాగే వీరమల్లు ఇంకా మార్కెట్ అవ్వని కారణంగా సినిమా వాయిదా పడుతుంది అనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

అది కూడా జూన్ 12 నుంచి హరి హర వీరమల్లు పోస్ట్ పోన్ అయ్యి జులై 4 అంటే కింగ్ డమ్ డేట్ ని లాక్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. అది చూసిన విజయ్ అభిమానులు కింగ్ డమ్ ని వదలవా వీరమల్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే హరి హర వీరమల్లు విడుదల వాయిదా అని ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. 

Rumors Swirl Around Hari Hara Veera Mallu Postponement

kingdom