సమంత vs రాజ్ నిడమోరు వైఫ్

Samantha vs Shhyamali

సమంత-దర్శకుడు రాజ్ నిడమోరు మధ్యన ఏం జరుగుతుంది, రాజ్ నిడమోరు భార్య శ్యామలి ఎందుకు సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ పోస్ట్ లు పెడుతుంది.. ఇన్ని అనుమానాలు కామన్ ఆడియన్స్ లో ఉన్నాయి, సమంత-రాజ్ నిడమోరు నిజంగానే డేటింగ్ లో ఉన్నారా అనే వార్తలకు బలం చేకూరేలా సమంత పోస్ట్ లు కనిపించడం, సమంత పోస్ట్ లు పెట్టిన సమయంలోనే రాజ్ నిడమోరు భార్య శ్యామలీ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం అంతా గందరగోళంగా తయారైంది. 

శుభం చిత్రం మేకింగ్ లో రాజ్ నిడమోరు ప్రతి విషయంలోనూ, ప్రతి ఫ్రేమ్ లోను దర్శనమిచ్చాడు. సమంత తాజాగా.. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న పిక్స్ తో పాటు, రాజ్ నిడిమోరుతో కలిసి పికిల్‌బాల్ ఆడుతున్న ఫోటోలు షేర్ చేసింది. సమంత ఈ ఫోటోలను షేర్ చేసిన సమయంలోనే రాజ్ నిడమోరు శ్యామలి కూడా కర్మ గురించి పోస్ట్ పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 

శ్యామలీ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ.. కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది. ఈ విశ్వం దీనిని నిశితంగా చూస్తుంటుంది, అంటూ.. నువ్వు ఏం ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అర్ధం వచ్చేలా పోస్ట్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇదంతా సమంత ను ఉద్దేశించే శ్యామలీ పోస్ట్ పెట్టింది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Shhyamali De shares cryptic post amidst Raj Nidimoru and Samantha

shhyamali