Advertisement

బుల్లితెర‌పై నంబ‌ర్ వ‌న్ సంపాద‌కుడు

బుల్లితెర‌పై అత్య‌ధిక పారితోషికం అందుకునే యాంక‌ర్ కం హోస్ట్ ఎవ‌రు? అంటే ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం- స‌ల్మాన్ ఖాన్. దేశ విదేశాల్లో అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న ఖాన్ ఒక్కో సినిమాకి 100 కోట్ల పారితోషికం, లాభాల్లో వాటాలు అందుకుంటున్నాడు. బుల్లితెర‌పైనా స‌ల్మాన్ పాపుల‌ర్ హోస్ట్. అత‌డు బిగ్ బాస్ 18 కోసం నెలకు రూ. 60 కోట్లు వసూలు చేయడం ద్వారా 2024లో అత్యధిక పారితోషికం పొందే భారతీయ టీవీ ప‌ర్స‌నాలిటీగా రికార్డుల‌కెక్కాడు. 15 వారాల సీజన్‌కు దాదాపు రూ. 250 కోట్లు సంపాదించాడని క‌థ‌నాలొస్తున్నాయి. బిగ్ బాస్ త‌మిళం కోసం క‌మ‌ల్ హాస‌న్ సంపాదిస్తున్న 150 కోట్లు, బిగ్ బాస్ తెలుగు కోసం నాగార్జున ఆర్జిస్తున్న 30 కోట్ల రెమ్యున‌రేష‌న్ తో పోలిస్తే స‌ల్మాన్ ఆర్జించేది చాలా ఎక్కువ‌. బిగ్ బాస్ 19, బిగ్ బాస్ OTT 4 త్వరలో రానున్న నేపథ్యంలో సల్మాన్ 2025లో తన ఫీజును మరింత పెంచేందుకు ఛాన్సుంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

 

టెలివిజన్ రంగంలో పెద్దగా సంపాదించే రారాజు ఆయన ఒక్కరే కాదు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 1కి రూ. 60 కోట్లు సంపాదించడం ద్వారా కపిల్ శర్మ కూడా టాప్ లీగ్ లో ఉన్నాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ `కౌన్ బనేగా కరోడ్‌పతి` చివరి సీజన్‌కు ఎపిసోడ్‌కు రూ. 4 కోట్ల నుండి రూ. 5 కోట్ల వరకు ఆర్జిస్తున్నార‌ని స‌మాచారం.

 

మహిళా హోస్ట్ ల‌లో `అనుపమ` హోస్ట్ రూపాలీ గంగూలీ చార్టులలో అగ్రస్థానంలో ఉన్నారు. రూపాలీ ఎపిసోడ్‌కు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నారు. భారతీయ టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం పొందుతున్న న‌టి కం హోస్ట్ గా రూపాలీ పేరు మార్మోగుతోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నుండి టీవీ స్టార్‌గా మారిన జన్నత్ జుబైర్ `ఖత్రోన్ కే ఖిలాడీ` కోసం ఎపిసోడ్‌కు దాదాపు రూ. 18 లక్షలు, లాఫ్టర్ ఛాలెంజ్‌లో పాల్గొన్నందుకు ఎపిసోడ్‌కు రూ. 2 లక్షలు సంపాదించార‌ని స‌మాచారం. 

Who is earning more in small screen

Number one earner in small screen
number one earner in small screen