Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kamal Haasan Thug Life banned in Karnataka

కమల్ వల్ల థగ్ లైఫ్ కి కష్టాలు

మణి రత్నం దర్శకత్వంలో కమల్ హాసన్-శింబు కలయికలో గ్యాంగ్ స్టర్ నేపద్యంలో తెరకెక్కిన థగ్ లైఫ్ జూన్ 5 న పాన్ ఇండియా మూవీ గా విడుదలకు సిద్దమవుతుంది. త్రిష హీరోయిన్ గా నటించిన థగ్ లైఫ్ ప్రమోషన్స్ మూవీ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కమల్ హాసన్, మణిరత్నం, శింబు, త్రిష, సుహాసిని ఇలా అందరూ హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు, చెన్నై నుంచి ముంబై వరకు థగ్ లైఫ్ ని ప్రమోట్ చేస్తున్నారు. 

అయితే జూన్ 5 న విడుదలకాబోతున్న థగ్ లైఫ్ కి కమల్ హాసన్ వల్ల కష్టం వచ్చిపడింది. కన్నడ భాష గురించి థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల ఫలితం ఇప్పుడు థగ్ లైఫ్ ని బ్యాన్ చేసేదాకా తీసుకొచ్చింది వ్యవహారం. కమల్ హాసన్ సారీ చెబితే సరిపోయేది, కానీ కమల్ మాత్రం క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా లేరు. 

అంతేకాదు ఒక ఎజెండా పెట్టుకుని పనిచేసే వాళ్లకు సమాధానం ఇవ్వనని, తప్పు చేయనప్పుడు నేనెందుకు క్షమాపణ చెప్పాలి, తప్పు చేసి ఉంటే సారీ చెబుతానని, ఇది నా లైఫ్ స్టైల్ అంటూ కమల్ కుండబద్దలు కొట్టారు, మరోపక్క కన్నడ హీరో శివరాజ్ కుమార్ కమల్ కి మద్దతుగా మాట్లాడడం అన్ని వెరసి ఇప్పుడు కన్నడలో థగ్ లైఫ్ ని బ్యాన్ చేసారు. 

జూన్ 5 న కన్నడలో థగ్ లైఫ్ విడుదలకాబోవడం లేదు, ఇదే కాదు ఫ్యూచర్ లో తమిళ సినిమాలకు కన్నడలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

Kamal Haasan film Thug Life faces ban in Karnataka

Kamal Haasan Thug Life banned in Karnataka
kamal haasan