ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bunny dedicated the Gaddar Award to them

గద్దర్ అవార్డు ను వారికి డేడికేట్‌ చేసిన బన్నీ

Bunny dedicated the Gaddar Award to them

ఈరోజు గురువారం అనౌన్స్ చేసిన తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ల్లో తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ల్లో పుష్ప-2 చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ని అవార్డు వరించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా.. 

తొలిసారిగా ప్రవేశ పెట్టిన తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ల్లో పుష్ప-2 చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డును అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నన్ను ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ క్రెడిట్‌ అంతా  దర్శకుడు సుకుమార్‌ గారికి, నా నిర్మాతకు, పుష్ప టీమ్‌కే చెందుతుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును నన్ను ప్రేమిస్తూ, నాకు ఎప్పుడూ సపోర్ట్‌గా నిలుస్తూ, నన్ను ఎల్లప్పుడూ ఎంతో ఇన్‌స్పయిర్‌ చేసే నా అభిమానులకు డేడికేట్‌ చేస్తున్నాను ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అంటూ అల్లు అర్జున ట్వీట్ చేసారు. 

Gaddar Awards: Allu Arjun Bags Best Actor Award

allu arjun