ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nara Lokesh Set to Become TDP Working President at Mahanadu

లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాల్సిందే

Nara Lokesh Set to Become TDP Working President at Mahanadu

కడప జిల్లాలో టీడీపీ మహానాడు పండుగ నిన్న మే 27 నుంచి రేపటి వరకు జరగనుంది. కడపలో ఏ సందు చూసినా, ఏ గొందు చూసినా పసుపు జెండాలు, పసుపు చొక్కాలతో మొత్తం పసుపుమయమయ్యింది. మహానాడు కార్యక్రమంలో పసందైన వంటలతో మహానాడు మెనూ చూస్తే ఈ మహానాడు కు వెళ్లాల్సిందే అంటారు. ఇక టీడీపీ సీనియర్ నేతలు, యువ నాయకులూ అందరూ ఉత్సాహంతో మహానాడులో కలియతిరుగుతున్నారు. 

ఏపీ సీఎం, టీడీపీ జాతియ అద్యక్షుడు చంద్రబాబు, మినిస్టర్ నారా లోకేష్, ఇంకా మంత్రులు, నేతలు అంతా మహానాడులో సందడి చేస్తున్నారు. కార్యకర్తలు ఉత్సాహం గా మహానాడు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మహానాడులో యువనేత నారా లోకేష్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. మహానాడు వేదికపై నేతలతో మాట కలపడం, సీనియర్స్ ని గౌరవించడం, అలాగే మహానాడు ప్రారంభోత్సవ స్పీచ్ అన్నిటిలో లోకేష్ హుందాతనం అందరిని ఆకర్షించింది. 

అయితే ఈ మహానాడు వేదికగా లోకేష్ కి పట్టాభిషేకం విషయంలో కార్యకర్తలే కాదు, టీడీపీ నేతలు కూడా చంద్రబాబు కి స్పెషల్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మే 28 సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ఇతర నాయకులూ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలని సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రతిపాదించారు. 

లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని తామంతా మినీ మహానాడులో తీర్మానించామని చంద్రబాబుకు చెప్పిన ధూళిపాళ్ల.. అందరూ కోరుకుంటున్న విధంగా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరిన ధూళిపాళ్ల, మరి ఈ విషయంలో చంద్రబాబు ఏం చెబుతారా అని అందరూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Nara Lokesh

nara lokesh