ఒక్క సినిమా-ముగ్గురు హీరోల లైఫ్ మేటర్
Bhairavam crucial for Three Heroesరేపు శుక్రవారం మే 30 న విడుదల కాబోతున్న భైరవం చిత్రం ముగ్గురు హీరోలకు లైఫ్ మేటర్ గా మారబోతుంది. ఎందుకంటే ఆ ముగ్గురు హీరోల్లో ఒకరైన బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చి కొన్నేళ్ళవుతుంది. ఛత్రపతి రీమేక్ తర్వాత శ్రీనివాస్ నేరుగా భైరవం తోనే అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కొన్నేళ్లుగా సక్సెస్ చూడని బెల్లంకొండ శ్రీనివాస్ కి భైరవం సక్సెస్ అత్యవసరం.
మరో హీరో మంచు మనోజ్ కి కూడా భైరవం హిట్ కొట్టాల్సిన అవసరం, అగత్యం ఏర్పడింది. మంచు మనోజ్ కి ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్, అలాగే కొన్నేళ్లుగా నటనకు బ్రేక్ ఇవ్వడం ఇవన్ని మనోజ్ కెరీర్ ని ఎఫెక్ట్ చేసాయి. భైరవంతో కమ్ బ్యాక్ అవ్వాలని మనోజ్ గట్టిగా కష్టపడ్డాడు, ప్రమోషన్స్ లోను అంతే కష్టపడుతున్నాడు. మరి భైరవం మనోజ్ కి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుందో అంటూ ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు.
ఇక నారా రోహిత్. నారా రోహిత్ కూడా నటనకు బ్రేకిచ్చి మధ్య మధ్యలో తన ఫ్రెండ్స్ నటించిన సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తున్నాడు.. తప్ప కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏళ్ళు గడిచిపోయాయి. సో నారా రోహిత్ కి కూడా భైరవం హిట్ అనేది అత్యవసరం అన్నట్టుగా ఉంది సిట్యువేషన్.
విజయ్ కనకమేడల తెరకెక్కించిన భైరవంపై ప్రస్తుతం పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. భైరవం ట్రైలర్ తర్వాత సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. మరి ఈ ముగ్గురు హీరోలను భైరవం ఎంతవరకు ఆదుకుంటుందో చూడాలి.
Bellamkonda Sreenivas, Nara Rohit and Manchu Manoj worked for Bhairavam








































