కాకాణికి ఏమైనా అయితే వదలం
Anil Kumar Yadav Reacts On Kakani Govardhan Reddy Arrestఅక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గత రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసులు విచారణకు రమ్మని నోటీసులు జారీ చేసినా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రం విచారణ కు హాజరవ్వకుండా ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తూ పోలీస్ లకు దొరక్కుండా తపించుకు తిరిగిన కాకాణి ని ఎట్టకేలకు నిన్న ఆదివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం ఆరోపణలపై నెల్లూరు జిల్లాలో కాకాణి పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్నారు. రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న కాకాణి ని చివరకు బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్‌లో నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాకాణి అరెస్ట్‌పై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాకాణికి హాని తలపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, అరెస్ట్‌లతో వైసీపీని అణగదొక్కాలని చూస్తే కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించడం హాట్ టాపిక్ అయ్యింది.
YSRCP Leaders On Kakani Govardhan Reddy Arrest







































