ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Does YSRCP have the right to react to Amaravati?

అమరావతిపై స్పందించే అర్హత వైసీపీకి ఉందా

జగన్ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే దానికి జై కొట్టిన జగన్, అధికారం చేపట్టగానే అమరావతిని అభివృద్ధి చేస్తే మరో హైదరాబాద్ లా అక్కడే అధికారం కేంద్రీకృతమవుతుంది, అందుకే ఏపీలో మూడు రాజధానులుండాలి అంటూ జగన్ మూడు ముక్కలాట స్టార్ట్ చేసాడు. 

వైజగ్, అమరావతి, కర్నూలు అంటూ మూడు రాజధానుల పేరుతొ జగన్ గత ఐదేళ్లుగా కాలయాపన చేసారు కానీ అమరావతిలో ఒక్క ఇటుక పేర్చలేదు. దానితో ప్రజలె జగన్ ని ఓడించారు. జగన్ ఓటమికి మూడు రాజధానుల ఆట కూడా ఓ కారణమైంది. ఇక కూటమి ప్రభత్వం అధికారంలోకి రాగానే అమరావతి లో అభివృద్ధిపనులు మొదలైపోయాయి. 

నిన్న శుక్రవారం అమరావతి పునర్నిర్మాణ కార్యరక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేయించారు. అది చూసి వైసీపీ ఏడుపు స్టార్ట్ చేసింది. జగన్ ను అమరావతి రీ లాంచ్ కి ఆహ్వానించినా రాలేదు, అలాగని జగన్ కానీ, మిగతా ఎవ్వరైనా కూటమి ప్రభుత్వాన్ని, అమరావతి రీ లాంచ్ పై కామెంట్స్ చేస్తే వ్యతిరేఖతపెరుగుతుంది, అందుకే అంబటి రాంబాబు లైన్లోకి వచ్చాడు. 

అమరావతి రాజధానిగా పనికిరాదంటూ మళ్లీ పాత పాటే పాడటమే కాకుండా, మోడీ వచ్చారు ఏమిచ్చారు, అమరావతి అభివృద్ధికి 52వేల కోట్లు అప్పు చేశారని పిచ్చిపిచ్చిగా మాట్లాడడం చూసిన వాళ్ళు అసలు అమరావతి పై మాట్లాడే హక్కు వైసిపికి ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Ambati Rambabu Reacts on Amaravati Restart

Does YSRCP have the right to react to Amaravati?
ambati rambabu