Advertisementt

ఫైనల్లీ పృథ్వీరాజ్ జన గణ మనపై క్రేజీ న్యూస్

Tue 29th Apr 2025 09:09 PM
jana gana mana  ఫైనల్లీ పృథ్వీరాజ్ జన గణ మనపై క్రేజీ న్యూస్
Finally crazy news about Jana Gana Mana ఫైనల్లీ పృథ్వీరాజ్ జన గణ మనపై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

మళయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా తెరకెక్కిన జన గణ మన సీక్వెల్ కోసం మళయాళీలే కాదు ఇతర భాషల మూవీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. పృథ్వీ రాజ్ సుకుమారన్ లాయర్ గా కనిపించిన ఈ చిత్రం ఓటీటీ లో ఇతర భాషల్లో సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. అంతేకాదు మలయాళంలో 50 కోట్లు రాబట్టిన ఈ చిత్ర సీక్వెల్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. 

జన గణ మన వచ్చి మూడేళ్లయినా ఎవరూ దాని సీక్వెల్ పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. తాజాగా జన గణ మన దర్శకుడు ఆంటోని జన గణ మన విడుదలై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అదిరిపోయే అప్ డేట్ ని పంచుకున్నారు. 

జన గణ మన మూడేళ్ళ పోస్టర్ ని షేర్ చేస్తూ.. అరవింద్ స్వామినాధన్(పృథ్వీరాజ్ సుకుమారన్ ) కొనసాగుతారు అంటూ పోస్ట్ చేసారు. అంటే జన గణ మనలో పృథీరాజ్ అరవింద్ కేరెక్టర్ లో కనిపించారు. సో జన గణ మన సీక్వెల్ ఉంటుంది అని ఆ చిత్ర దర్శకుడే ఇలా అప్ డేట్ ఇవ్వడంతో పృథ్వీ రాజ్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీలవుతున్నారు.

Finally crazy news about Jana Gana Mana:

Interesting update on Jana Gana Mana movie 

Tags:   JANA GANA MANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ