కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కాంట్రవర్సీలకు దూరంగా ఉండే హీరో. అజిత్ కు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. తరచూ తన సినిమాల్తో హీరో విజయ్ తో పోటీ పడే అజిత్ .. విజయ్ మాత్రం మంచి స్నేహం చేస్తాడు. కానీ అభిమానులు మాత్రం విజయ్ ఫ్యాన్స్ vs అజిత్ ఫ్యాన్స్ అన్నట్టుగా కొట్టుకు చస్తారు.
కొన్నేళ్లుగా అజిత్ సినిమాలు, కార్ రేసింగ్స్ అంటూ చాలా బిజీగా కనిపిస్తున్నారు. రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం సక్సెస్ మూడ్ లో ఉన్న అజిత్ పై మాజీ హీరోయిన్ సంచలన ఆరోపణలు చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. అజిత్ సినిమా కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమ లేఖ మూవీలో నటించిన హీరోయిన్స్ లో హీరా రాజ్ గోపాల్ కూడా ఒకరు. అప్పట్లో అంటే అజిత్ షాలినిని పెళ్లి చేసుకోక మునుపు హీరాతో రిలేషన్ లో ఉన్నారని ప్రచారం జరిగింది.
అయితే హీరా ఊహించని విధంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. హీరోకు చెందిన పర్శనల్ బ్లాగ్ నుంచి ఆ హీరో పేరు ప్రస్తావించకుండా ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. తనని ప్రేమించిన హీరో ఒక పచ్చి మోసగాడు, అతను నమ్మించి మోసం చేసాడు, ఆ హీరో కారణంగా నేను ఆత్మహత్య చేసుకునే స్థితి లోకి కూడా వెళ్లాను.
అంతేకాకుండా హీరోపై మరో షాకింగ్ అలిగేషన్ కూడా చేసింది. తాను ఒక యావరేజ్ రేంజ్ లో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అపుడు ఆమె వైపు ఎవరూ చూడరు, సో నేను నాకు నచ్చిన అమ్మాయితో రొమాన్స్ చేయొచ్చు అని చెప్పాడని అంటూ మాట్లాడడం చూసి ఆమె అజిత్ ను ఉద్దేశించి చేసిందే అని అందరూ మాట్లాడుకుంటున్నారు.