Advertisementt

మలయాళంలో మరో బ్లాక్ బస్టర్

Tue 29th Apr 2025 12:07 PM
mohanlal  మలయాళంలో మరో బ్లాక్ బస్టర్
Thudarum Box office Collection మలయాళంలో మరో బ్లాక్ బస్టర్
Advertisement
Ads by CJ

మలయాళంలో రీసెంట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన L 2 ఎంపురాన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా భాషల్లో వర్కౌట్ అవ్వకపోయినా మలయాళంలో 300 కోట్ల చిత్రంగా ఇండస్ట్రీ హిట్ అయిన ఈ చిత్రంలో మోహన్ లాల్ హీరో. ఇప్పుడు అదే మోహన్ లాల్ నటించిన మరో చిత్రం మలయాళంలో సూపర్ హిట్ రెస్పాన్స్ తో దూసుపోతుంది. 

మోహన్ లాల్-శోభన కలయికలో తెరకెక్కిన తుడరుమ్ ఈ నెల 25న థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రానికి మళయాళంలోనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి షో పూర్తి కాగానే సోషల్ మీడియాలో తుడరుమ్ టాక్ చూసిన తర్వాత  టికెట్ అమ్మకాలు ఊపందుకున్నాయి.

మలయాళంలో విడుదలైన ఒక రోజు తర్వాత తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే విడుదలైంది. అయినప్పటికీ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తుడరుమ్ లో దృశ్యం తరహా కథ, కథనాలు ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యడమే కాదు మోహన్ లాల్ నటన, శోభన పెరఫార్మెన్స్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ చిత్రం మూడు రోజులు గడిచేసరికి దాదాపుగా 70 కోట్లు కలెక్ట్ చేసింది. 

మరి బ్యాక్ టు బ్యాక్ మోహన్ లాల్ సినిమాలు మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

Thudarum Box office Collection:

Mohanlal Creating Sensation With Thudarum

Tags:   MOHANLAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ