Advertisementt

ఎవరు ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు

Tue 29th Apr 2025 11:26 AM
vijay deverakonda  ఎవరు ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు
Vijay Deverakonda gifts RWDY Wear to Suriya ఎవరు ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన రెట్రో చిత్ర తెలుగు ప్రమోషన్స్ కోసం రౌడీ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు. రెట్రో హిట్ అవ్వాలని కోరుకున్నారు. సూర్య ని సపోర్ట్ చేస్తూ విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ చేసారు. ఇప్పుడు సూర్య విజయ్ దేవరకొండ క్లోతింగ్ రౌడీ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ కనిపించారు. 

విజయ్ దేవరకొండ ప్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ గురించి అందరికి తెలిసిందే. రీసెంట్ గా విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ కి రౌడీ బ్రాండ్ దుస్తులు పంపించగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఆ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఇపుడు స్టార్ హీరో సూర్య రౌడీ వేర్ పోలో టీ షర్ట్స్ లు ధరించి స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. రౌడీ వేర్ టీ షర్ట్స్ తో సూర్య తన కొత్త సినిమా రెట్రో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. 

సో రెట్రో ఈవెంట్ కి విజయదేవరకొండ వచ్చి సినిమాని ప్రమోట్ చేస్తే.. ఇప్పుడు సూర్య రౌడీ వేర్ బ్రాండ్ టీ షర్ట్ వేసుకుని విజయ్ దేవరకొండ క్లోతింగ్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నారు. అది చూసిన నెటిజెన్స్ ఎవరు ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Vijay Deverakonda gifts RWDY Wear to Suriya :

Vijay Deverakonda gifts RWDY Wear to Suriya during RETRO Promotions

Tags:   VIJAY DEVERAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ