దశాబ్ధాలుగా తనదైన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహమాన్ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా? అతడు తన సుదీర్ఘమైన కెరీర్ లో 150 పైగా చిత్రాలకు పని చేసాడు. ఒక్కో పాటకు 3 కోట్లు పైగా పారితోషికం అందుకునే అత్యంత డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు. విదేశీ కాన్సెర్టులతోను భారీగా ఆర్జించాడు. మొజార్ట్ ఆఫ్ మద్రాస్ అని పిలుపందుకున్న రెహమాన్ కి చెన్నైలో 15 కోట్ల ఖరీదైన ఇల్లు ఉంది. ఇదే గాక సొంత స్టూడియోలు, ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే లాస్ ఏంజెల్స్ లో 25 కోట్ల ఖరీదైన మరో సొంత ఇల్లు స్టూడియో ఉన్నాయి. చెన్నైలో ఖరీదైన స్టూడియో సెటప్ ఉంది. దీని విలువ కోట్లలో ఉంటుంది. దుబాయ్, లండన్ లోను అతడికి సొంతంగా స్టూడియోలు ఉన్నాయి. రెహమాన్ నికర ఆస్తుల విలువ రూ. 1728 కోట్లుగా ఉందని జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి.
ఏ.ఆర్ రెహమాన్ కార్ గ్యారేజీలో ఖరీదైన మెర్సిడెస్ బెంజ్, పోర్చే ఈవీ, జాగువార్, వోల్వో వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటన్నిటి విలువ సుమారు 8కోట్లు పైగా ఉంటుందని అంచనా. వందల కోట్ల ఆస్తులు ఉన్నా అతడు సైలెంట్ గా ఉంటాడు. ఎలాంటి హంగామా లేకుండా రిచ్ లైఫ్ స్టైల్ ని ఆస్వాధించే రెహమాన్ ఎక్కువగా రాత్రి వేళల్లో పని చేస్తారనేది తెలిసిందే. దిలీప్ అనే బాలుడిగా టాలీవుడ్ సంగీత దర్శకుల వద్ద సహాయకుడిగా పని చేసిన రెహమాన్ ప్రారంభం పూట గడవడం కోసం, కుటుంబాన్ని పోషించేందుకు బాల్యంలోనే చాలా తంటాలు పడ్డాడు.
కానీ సంగీతంపై పిచ్చి ప్రేమ, అకుంటిత ధీక్ష నేడు ఇంత పెద్ద ధనికుడిగా ఎదిగేందుకు సహాయపడింది. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఆస్కార్ లు సొంతం చేసుకున్న రెహమాన్ మణిరత్నం `రోజా`చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. తాను పని చేసిన తొలి చిత్రానికే జాతీయ అవార్డు దక్కింది. కెరీర్ లో లెక్కలేనన్ని అవార్డులు రివార్డులను సొంతం చేసుకున్నాడు. రెహమాన్ కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ధనిక సంగీత దర్శకులలో ఒకరిగా ఉన్నారు.