నటసింహం, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ కు ఆయన కుటుంబానికి ఈరోజు ఏప్రిల్ 28 చాలా ప్రత్యేకమైన రోజు. భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ట్మాత్మకమైన పద్మ భూషణ్ అవార్డును అందుకునేందుకు బాలయ్య తన భార్య వసుందర, అక్క, ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు మోక్షజ్ఞ, పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి, అల్లుడు నారా లోకేష్, మనవడు దేవాన్ష్, చిన్న కుమార్తె తేజస్వి, చిన్నల్లుడు భరత్ తో కలిసి పంచెకట్టు తో ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ముందు దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగువాడి రాజసాన్ని తన డ్రెస్సింగ్ స్టయిల్లో అంటే అచ్చ తెలుగు పంచెకట్టులో బాలయ్య ఫ్యామిలీతో కలిసి పరిపూర్ణంగా కనిపించారు. పద్మభూషణ్ రావడం ఒక్క అడుగు ఆలస్యమైనా.. అది తనకు ఎంతో అపురూపమని చెప్పుకుని మురిసిపోయిన బాలయ్య నేడు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డును అందుకున్న విజువల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
నటుడిగా 50 ఏళ్ళ ప్రస్థానంలో ఎన్నో విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న బాలయ్య అటు రాజకీయాల్లో హ్యాట్రిక్ ఎమ్యెల్యేగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య నుంచి అఖండ 2 ట్రీట్ ఆయన బర్త్ డే కోసం సిద్దమవుతుంది. అప్పటివరకు నందమూరి అభిమానులు ఈ పద్మభూషణుడు రాజసాన్ని తలచుకుంటూ పొంగిపోయేలా కనిపిస్తున్నారు.