బాలీవుడ్ లో పొడుగు కాళ్ళ సుందరి అంటే టక్కున గుర్తొచ్చే పేరు దీపికా పదుకొనె. అదే టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో పొడుగుకాళ్ల సుందరిగా పేరు తెచ్చుకున్న భామ మీనాక్షి చౌదరి. లక్కీ భాస్కర్ తర్వాత లక్కీ హీరోయిన్ గా మారిన మీనాక్షి కి మధ్యలో కొన్ని సినిమాలు డిజప్పాయింట్ చేసినా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మరోసారి క్రేజిగా మారింది.
తాజాగా మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ రోల్ పై స్పందించింది. ఆ చిత్రం హిట్ అవడం హ్యాపీ నే కానీ, అందులో అమ్మ పాత్రలో నటించడమే నచ్చలేదు, ప్రస్తుతం భార్య పాత్రలకు, అమ్మ పాత్రలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పిన మీనాక్షి చౌదరి తన హైట్ పై చేసిన కామెంట్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. చిన్నప్పుడు నేను చాలా ఇంట్రావర్ట్. నేను కాలేజ్ కి వచ్చేటప్పటికి నా హైట్ 6.2 దానితో అమ్మాయిలు కూడా నాతో కలిసి నడిచేందుకు, మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు.
అంతేకాదు ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేసేవారు. చాలా బాధగా అనిపించేది. మా నాన్నకు చెబితే నీ సమస్యకు నువ్వే పరిష్కారం వెతుక్కో అనేవారు. నేను బుక్స్ విపరీతంగా చదివేదాన్ని, ఫ్రెండ్స్ తక్కువ, అందాల పోటీలో, అలాగే స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ల నలుగురు కలుస్తారనేది వాస్తవం.. అంటూ తన హైట్ వలన తనెంత సఫర్ అయ్యిందో చెప్పుకొచ్చింది.