కింగ్ నాగార్జున నా సామి రంగ తర్వాత సోలో ప్రాజెక్ట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటే నాగార్జున మాత్రం కూలి, అలాగే కుబేర చిత్రాల్లో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ మల్టీస్టారర్స్ పై దృష్టి పెడుతున్నారు, తప్ప సోలో ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.
అంతేకాదు అటు కొడుకుల పెళ్లిళ్లు, ఇటు చిన్న కొడుకు అఖిల్ కెరీర్ ని తీర్చిదిద్దే పనుల్లో బిజీగా వున్న నాగార్జున ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ దర్శకుడు శైలేష్ కొలను తో సినిమాకి ఓకె చెప్పారనే టాక్ నడుస్తుంది. హిట్ 3 దర్శకుడు శైలేష్ కొలను కి కింగ్ నాగార్జున కు మద్యన స్టోరీ డిస్కర్షన్స్ జరిగాయని తెలుస్తుంది.
నాగార్జున కు స్టోరీ లైన్ నచ్చి ఫుల్ స్టోరీని డెవెలెప్ చెయ్యమని శైలేష్ కొలనులో చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇంతకుముందు కూడా నాగార్జున తమిళ దర్శకులతో కమిట్ అవుతున్నారనే వార్తలు రావడమే కాదు అఫీషియల్ ప్రకటన వచ్చింది లేదు. మరి శైలేష్-నాగ్ కాంబో సెట్ అయితే అది క్రైమ్ జానర్ లోనే ఉంటుంది అని టాక్.