బాలీవుడ్ లో శ్రీదేవి డాటర్ గా, స్టార్ కిడ్ గా జాన్వీ కపూర్ కి ఉండే క్రేజే వేరు. హిందీ సినిమాలతో సక్సెస్ అవ్వకపోయినా ఆమె సోషల్ మీడియా క్వీన్. తరచూ గ్లామర్ షో చేస్తూ అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకుంటుంది. ఇక సౌత్ లో జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ గ్లోబల్ స్టార్స్ తో సినిమాలు చేస్తుంది.
మరోపక్క హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి సౌత్ లో స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. సీతారామం చిత్రం తర్వాత మృణాల్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. హిందీలోనూ మృణాల్ ఠాకూర్ కి మంచి క్రేజుంది. తాజాగా ఓ ఈవెంట్ లో మృణాల్ ఠాకుర్ విషయంలో జాన్వీ కపూర్ ప్రమేయం లేకుండా తనకి జరిగిన ఓ అవమానం గురించి బయటపెట్టింది మృణాల్.
క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో అవార్డ్స్ అందుకున్న సందర్భగా మీడియా వేస్తున్న ప్రశ్నలకు మృణాల్ ఠాకూర్ సమాధానాలు ఇస్తున్న సమయంలో అక్కడి జాన్వీ కపూర్ రాగానే.. తనని వదిలేసి అందరూ జాన్వీ కపూర్ దగ్గరకు వెళ్లిపోవడంతో తను చాలా అవమానంగా ఫీలైనట్లుగా అనిపంచింది అని చెప్పడమే కాదు, స్టార్ కిడ్స్ కి ఉన్న ప్రాధాన్యత మిగతా నటులకు ఉండదు అంటూ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది.