మలయాళ స్టార్ హీరోస్ మోహన్ లాల్, మమ్ముట్టి మధ్యన టాప్ చైర్ కాంపిటీషన్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరి మద్యన పోటీ ఉన్నట్టే కనిపిస్తుంది. ఎవరికీ వారే వారి వారి పెరఫార్మెన్సెస్ తో అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే వీరి మద్యన ఎంత అనుబంధం ఉందొ రీసెంట్ గా కేరళలోని శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయంలో మమ్ముట్టి అసలు పేరుతొ మోహన్ లాల్ స్పెషల్ పూజ చేయించడంతో బయటపడింది. ఆ పూజ వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ఇక మమ్ముటి నేను కలిసి మా కెరీర్ లో దాదాపుగా యాభై సినిమాల్లో నటించాము. మమ్ముట్టి నా ప్రాణ స్నేహితుడు. మేమిద్దరం ఇంకా మరిన్ని చిత్రాల్లో కలిసి పని చేయాలనేదే నా కోరిక. రోజుకి ఒక్కసారైనా మమ్ముట్టితో మాట్లాడనిదే నాకేమీ తోచదు. మా మధ్య పోటీ ఉంది అని అందరూ అనుకుంటారు. కానీ మా మధ్య మంచి స్నేహం ఉంది అని మమ్ముట్టితో స్నేహంపై మోహన్ లాల్ చెప్పారు.
నలభై ఎనిమిదేళ్ల ఈ సినీ కెరీర్‌లో నేను సినిమాను ప్రేమించినంతగా మరి దేన్నీ ప్రేమించలేదు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నాలుగైదు చిత్రాలకు ఓకే చెబుతుంటా. నిజానికి నాకు రెస్ట్ తీసుకోవడం, అలాగే ఖాళీగా ఉండటమంటే అస్సలు నచ్చదు. అందుకే ఎప్పుడూ సినిమాల్లో బిజీగా ఉంటాను అంటూ మోహన్ లాల్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ అలాగే మమ్ముట్టి తో స్నేహం పై ఓపెన్ అయ్యారు.