ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ తనపై వేధింపులకు పాల్పడ్డాడని హిందీ టీవీ నటి నవీనా బోలే ఆరోపించారు. కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనను తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో సదరు నటీమణి బయటపెట్టారు. అతడు చాలామంది అమ్మాయిలను వెంటాడాడు. ఇంటికి పిలిచి వేధించాడని కూడా నవీనా ఆరోపించారు. గ్లాడ్ రాగ్స్ కోసం అమ్మాయిలను పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు.
నన్ను ఇంటికి పిలిచాడు.. బట్టలు విప్పాలని కోరాడు! అని గుర్తు చేసుకున్నారు నవీనా. నా జీవితంలో నేను ఎప్పుడూ కలవడానికి ఇష్టపడని ఒక భయంకరమైన వ్యక్తి సాజిద్ ఖాన్. మహిళలను అగౌరవపరిచే విషయంలో అతడు వెనకాడడు. `హే బేబి` చిత్రంలో నటించేప్పుడు ఈ అనుభవం ఎదురైందని నవీనా గుర్తు చేసుకున్నారు. ఘటన అనంతరం తాను వెళ్లిపోయాక మళ్లీ ఫోన్ చేసి ``నేను నిజంగా ఉత్సాహంగా ఉన్నానని నీకు తెలుసు.. నువ్వు బట్టలు విప్పి లోదుస్తుల్లో కూర్చోవద్దు.. నువ్వు ఎంత కంఫర్టబుల్ గా ఉన్నావో చూడాలని అలా అడిగాను`` అని అన్నాడు. అప్పట్లో గ్లాడ్ రాగ్స్ కోసం అతడితో పని చేసాను. 2004- 2006 సంవత్సరాల మధ్య ఇదంతా జరిగిందని నవీనా గుర్తు చేసుకున్నారు. సాజిద్ మిసెస్ ఇండియా జడ్జిగా ఉన్నప్పుడు మళ్ళీ తనను సంప్రదించాడని నవీన వెల్లడించింది. ``నువ్వు ఏం చేస్తావు..పాత్ర కోసం నన్ను చూడాల``ని అడిగాడు. అతడు చాలా మంది మహిళల్ని కొట్టాడు. నన్ను కూడా కొట్టిన విషయాన్ని మర్చిపోయాడు అని వ్యాఖ్యానించింది.
2018లో భారతదేశంలో #MeToo ఉద్యమం సమయంలో సాజిద్ ఖాన్ పై ఒక మహిళా జర్నలిస్టు సహా పలువురు నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై విచారణ సాగింది.