కాంట్రవర్సీలకు ఎప్పుడు దూరంగా ఉండే హీరో మహేష్ బాబు కి ఈడీ అధికారులు రీసెంట్ గా నోటీసులు పంపించడం హాట్ టాపిక్ అయ్యింది. మహేష్ బాబు పబ్లిసిటీ చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేష్ అందుకున్న పారితోషికానికి లెక్కలు చూపలేదంటూ ఈడీ అధికారులు మహేష్ కి నోటీసులు పంపారు.
రియల్ ఎస్టేట్ కంపెనీ సాయి సూర్య డెవలపర్స్ స్కామ్ లో మహేష్ కి భాగం లేకపోయినా, మహేష్ ప్రమోషనల్ యాడ్స్ చూసి ప్రజలు అందులో డబ్బు పెట్టి మోసపోయారని, అంతేకాకుండా 5.9 కోట్ల రూపాయలను ప్రమోషన్స్ కోసం పారితోషికం అందుకున్న మహేష్ 3.9 కోట్ల రూపాయలను చెక్కు రూపంలో తీసుకొని రెండు కోట్ల రూపాయలను బ్లాక్ లో తీసుకున్నారని తెలుసుకున్న ఈడీ అధికారులు నోటిసులు ఇచ్చారు.
అయితే మహేష్ రేపు సోమవారం ఈడీ ఆఫీస్ కు విచారణ కోసం వెళ్లాల్సి ఉంది. కానీ రేపు సోమవారం విచారణకు హాజరు కాలేనని మహేష్ బాబు అధికారులకు లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది. తనకు (SSMB 29) షూటింగ్ ఉన్నకారణంగా రేపు విచారణకు హాజవ్వవలేను అని, మరోరోజు విచారణకు సహకరిస్తాను అని ఈడీ అధికారులకు మహేష్ లేఖ రాసినట్లుగా తెలుస్తుంది.