ఈరోజు హైదరాబాద్ లో జరగనున్న నాని హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా దర్శకధీరుడు రాజమౌళి రాబోతున్నారు. ఆ ఈవెంట్ లో నాని హిట్ 3 గురించి రాజమౌళి ఎలాగూ మాటాడతారు. అయితే హిట్ 3 ఈవెంట్ లో అందరి చూపు రాజమౌళి పైనే ఉంటుంది. అటు మహేష్ అభిమానులైతే మరింత అతృతతో కనబడుతున్నారు.
కారణం రాజమౌళి మహేష్ తో తెరకెక్కిస్తున్న SSRMB పై ఏమైనా హింట్ ఇస్తారేమో అని. అసలే జనవరి నుంచి ఎలాంటి హడావిడి లేకుండా, చాలా అంటే చాలా సైలెంట్ గా SSRMB షూటింగ్ చేస్తున్న రాజమౌళి.. మహేష్ సినిమాపై ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారా అని అందరూ వెయిట్ చేస్తున్న సమయంలో రాజమౌళి పబ్లిక్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు.
మరి ఇప్పటివరకు SSRMB పై సీక్రెట్ ని మైంటైన్ చేసిన రాజమౌళి.. హిట్ 3 ఈవెంట్ లో ఏమైనా హింట్ ఇస్తారేమో, అది ఎంత చిన్న లీక్ అయినా అభిమానుల ఆనందానికి పట్ట పగ్గాలుండవు. అందు కోసమే రాజమౌళి హిట్ 3 ఈవెంట్ కి గెస్ట్ గ రాబోతున్నారని తెలిసినప్పటి నుంచి అందరూ ఎంతో ఆతృతగా కనబడుతున్నారు. చూద్దాం రాజమౌళి ఏమైనా SSRMB గురించి ఓపెన్ అవుతారేమో అనేది.