టాప్ హీరోయిన్ సమంత నిర్మాతగా మొట్టమొదటిగా నిర్మించిన చిత్రం శుభం. ఈ చిత్రం మే 9 న రిలీజ్ కి రెడీ అయ్యింది. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఆదివారం శుభం ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న శుభం చిత్రంలో నటులందరూ కొత్తవాళ్లే.
శుభం ట్రైలర్ లోకి వెళితే.. ఊర్లోని మహిళలంతా కూడా సీరియల్‌ను చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంటారు. దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటే.. వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటి తరుణంలో మాతాజీగా సమంత స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ట్రైలర్ మీద మరింత ఇంట్రెస్ట్ కలిగించేలా చేశారు.
ఈ చిత్రంలో కామెడీ, హర్రర్, ఉత్కంఠ, ఎమోషన్స్ అన్ని హైలెట్ అవ్వగా.. సమంత మాతాజీ ఎంట్రీ మాత్రం అభిమానులను సర్ ప్రైజ్ చేసేలా ఉంది. మే 9 న థియేటర్స్ లో శుభం చిత్రాన్ని మిస్ అవ్వకండి మరి.