ఒకప్పటి టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని సౌత్ ఆడియన్స్ ఆల్మోస్ట్ మర్చిపోయారు. సౌత్ కి దూరమైపోయిన రకుల్ హిందీలో సక్సెస్ అయ్యేందుకు కిందా మీదా పడుతుంది. అయినా అక్కడే ముంబై లో సెటిల్ అయ్యి బాలీవుడ్ నిర్మాత కమ్ నటుడు జాకీ భగ్నానీ ని వివాహం చేసుకుని హిందీలోనే అదృష్టాన్ని వెతుక్కుంటుంది.
ఇక షూటింగ్ నుంచి బ్రేక్ వచ్చింది అంటే రదాగా భర్త తో కలిసొ, లేదంటే ఫ్రెండ్స్ తోనో, కాదు పేరెంట్స్ తోనో రకుల్ ప్రీత్ ఎంజాయ్ చెయ్యడానికి వెకేషన్ కి వెళ్ళిపోతుంది. తాజాగా రకుల్ వీకెండ్ వెకేషన్ అంటూ షిప్ లో రచ్చ రచ్చ చేస్తూ కనిపించింది. సముద్రం మధ్యలో కాస్ట్లీ షిప్ లో రకుల్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది.
ఆ ఫొటోస్ లో రకుల్ ప్రీత్ గ్లామర్ గా కళ్ళకు గాగుల్స్ తో అందాల జాతర చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. మరి వీకెండ్ మోటివేషన్ లో రకుల్ ఈ వీకెండ్ ఇలా షిప్ లో ఎంజాయ్ చేస్తుందన్నమాట.