టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ `పంచ్ డైలాగు`లకు ఆకర్షితులు కాని వాళ్లు లేరు! ఆయన పంచ్ కి ఒక లెక్క ఉంది. డైరెక్ట్ గా మైండ్ కి ఎక్కుతుంది. టాలీవుడ్ లో చాలామంది డైలాగ్ రైటర్లు ఉన్నామని చెప్పుకున్నా పూరి `ఒక్క పంచ్` ముందు ఎవరైనా దిగదుడుపే. జనాలు మెచ్చే పవర్ ప్యాక్డ్ పంచ్ డైలాగులు రాయడంలో పూరి తర్వాతే ఎవరైనా!
అందుకే ఆయన `పూరి మ్యూజింగ్స్` పేరుతో అద్భుతమైన రచనల్ని తన వాయిస్ లో వినిపిస్తుంటే వాటికి వీరాభిమానులేర్పడ్డారు. పూరి తన జీవితంలోని అనుభవ పాఠాల నుంచి ఇప్పటికే చాలా మ్యూజింగ్స్ అందించారు. అయితే ఈసారి పూరి మ్యూజింగ్స్ లో రెండు విషయాలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఒకటి పెళ్లి, విడాకుల గురించి ఆయన అభిప్రాయం.. రెండోది మనిషి ఒక యాత్రికుడిలా ఉండాలని, ఆస్తులు అంతస్తులకు కాపలా ఉండకూడదని చెప్పారు. పెళ్లి చేసుకుని ఒక చోటా స్టక్ అయిపోవద్దని పూరి అన్నారు. అగ్రిమెంట్లు, విడాకులు అంటూ పిచ్చి పనుల్లో ఇరుక్కోకు అని అన్నాడు. తాళి కట్టి అప్పులు, అద్దెలు అంటూ చావొద్దని కూడా పూరి సూచించాడు.
మనిషి ఒక యాత్రికుడిలా ఉండాలని, వెళ్లే మార్గంలో పెళ్లితో కమిటవ్వొద్దని కూడా పూరి సూచించాడు. అలా చేస్తే అద్దెలు, అప్పులు కట్టాలని ఆ తప్పు చేయొద్దని అన్నాడు. నువ్వు కట్టిన ఇల్లుతో పాటు అన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఎక్స్ పయిరీ డేట్ ఎప్పుడు అయిపోతుందో తెలీదు! అని వేదాంతం వల్లించాడు. ముందు నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో అని కూడా పూరి సూచించాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రంపై వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.