దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ చిత్రం సక్సెస్ తో 100 కోట్ల డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిన వెంకీ అట్లూరి తదుపరి చిత్రాన్ని ఏ హీరో తో చేస్తాడో అనే క్యూరియాసిటీ అందరిలో కనిపించింది. వెంకీ అట్లూరి-నాగవంశీ కాంబో లోనే సితార ఎంటర్టైన్మెంట్స్ లో కోలీవుడ్ హీరో సూర్య తో Suriya46 చిత్రానికి సంబందించిన కథా చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం జరిగింది.
ఇప్పుడు అదే అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు హీరో సూర్య. హైదరాబాద్ లో జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకీ అట్లూరి తదుపరి హీరో సూర్య, సితార నిర్మాణంలో Suriya46 ఉండబోతున్నట్టుగా అధికారికంగా అనౌన్స్ చేసారు. ఇప్పటికే వెంకీ అట్లూరి-సూర్య కాంబో Suriya46 సంబంధించి ప్రీ ప్రోడక్షన్ వర్క్ దుబాయ్ లో జరుగుతుంది అన్నారు.
నాగవంశీ-వెంకీ అట్లూరి ముంబై వెళ్లి సూర్యతో డిస్కర్స్ చేసి, కథ చెప్పి ఆయన్ని ఒప్పించారు. ఇప్పుడు రెట్రో ఈవెంట్ లో అధికారికంగా వెంకీ అట్లూరి-సూర్య కాంబో Suriya46 ని అనౌన్స్ చేసారు.