ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ నేచురల్ స్టార్ నాని మధ్య ఓ అద్భుతమైన బాండింగ్ ఉంది. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ పై ప్రతీకార చర్యగా అప్పటి ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తే అందుకు సినిమా ఇండస్ట్రీ మొత్తం సఫర్ అయ్యింది. అయితే ఎవరూ నోరెత్తలేదు కానీ.. నాని మాత్రం ఘాటుగా స్పందించాడు. ధీటైన విమర్శలు చేసాడు. ఇది అందరికి గుర్తుండే ఉంటుంది.
ఇది గ్రహించే, ఇదంతా గమనించే నాని సినిమా అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం స్వయంగా కదలి వచ్చారు పవన్ కళ్యాణ్. ఆ ఈవెంట్ లో నాని తన కుటుంబ సభ్యులందరికి కూడా ఫేవరేట్ హీరో అంటూ ఆకాశానికెత్తేశారు. వీరిద్దరి బాంధవ్యం అక్కడితో ఆగలేదు. 2024 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ విజయకేతనం ఎగురవేయగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ముందుగా స్పందించిన వ్యక్తి, ఆ సక్సెస్ పట్ల అంతులేని సంతోషాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి నాని.
ఇందుకు కారణం లేకపోలేదు. అప్పట్లో టికెట్ రేట్ల విషయంలో కిరాణా కొట్లతో కంపేర్ చేస్తూ నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. వైసీపీ టీమ్ సోషల్ మీడియాలో నానిని ఆడేసుకుంది. అందుకే ఆ ప్రభుత్వం మారాలని బలంగా కోరుకున్నాడో ఏమో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన ఆనందాన్ని ప్రదర్శించాడు.
ఇక ఇప్పుడు అసలు విషయానికొస్తే నాని తన హోమ్ బ్యానర్ లో తానే హీరోగా చేసిన హిట్ 3 వచ్చేవారం విడుదలకాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చకచకా అన్ని నగరాలు చుట్టేస్తోన్న నాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన సినిమా టికెట్ రేట్ల విషయంలో వినతి పత్రం సమర్పించారు. ఆ సినిమాకి అయిన ఖర్చు రీత్యా రెట్ల వెసులుబాటు ఇవ్వాలంటూ అభ్యర్ధించారు. ఆంధ్రలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ జనసేన నేతే కావడం గమనార్హం. తనకు వత్తాసు పలికిన నాని కి పవన్ ఆశీస్సులివ్వడం తథ్యం. ఇక ఇక్కడ ఆలోచించేదేముంది అక్కడున్నది పవన్ ఇక్కడ అడుగుతోంది నాని. అస్సలు సందేహం అక్కర్లేదు.. రిటన్ గిఫ్ట్ గ్యారెంటీ.