తండేల్ భారీ సక్సెస్ తర్వాత నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండుతో NC 24మూవీ ఎనౌన్స్ చేసారు. తండేల్ విడుదలైన రెండు నెలలైంది. కానీ నాగ చైతన్య కార్తీక్ దండు తో కలిసి NC 24 సెట్స్ పైకి వెళ్ళలేదు. తాజాగా నాగ చైతన్య-కార్తీక్ దండుల NC 24 చిత్రం బిగిన్ చేస్తున్నట్టుగా ఓ వీడియో వదిలారు.
అందులో నటులు అలాగే హీరో నాగ చైతన్య లుక్ టెస్ట్, కొన్ని నెలలుగా ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న విషయం, అలాగే NC 24 లొకేషన్స్ ను చూపిస్తూ రచ్చ రచ్చ గా వీడియో వదిలారు. సుకుమార్ రైటింగ్ స్కిల్స్ నుంచి NC 24 ని భారీ మైథికల్ థ్రిల్లర్, విజువల్ వండర్ గా తెరకెక్కించబోతున్నట్టుగా ఈ వీడియోతోనే చెప్పేసారు.
ఇక ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన శ్రేలీల నటిస్తుందా, లేదంటే మీనాక్షి చౌదరి నటిస్తుందా అనేది కాస్త వెయిట్ చేస్తే కానీ క్లారిటి రాదు. అప్పటివరకు ఈ సస్పెన్స్ ఇలా కంటిన్యూ అవ్వాల్సిందే.