హీరో నాని దసరా చిత్రం టైమ్ నుంచి పాన్ ఇండియా హీరో కావాలనే కలతో కష్టపడుతున్నారు. చాలామంది మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాని పాన్ ఇండియా లోని ఐదు భాషల్లో సినిమా విడుదలవుతుంది అని చెప్పి ప్రమోషన్స్ పట్టించుకోకుండా డైరెక్ట్ గా రిలీజ్ చేస్తూ ఉంటారు. నాని అలా కాదు. దసరా సినిమా టైమ్ లోనే చెన్నై నుంచి కేరళ వరకు సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు.
దసరా తెలుగులో 100 కొట్ల సినిమాగా నిలిచింది. కానీ ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత కూడా నాని వరసగా తన సినిమాలను పాన్ ఇండియా మార్కెట్ లోనే విడుదల చేస్తున్నాడు, ప్రమోషన్స్ చేస్తున్నాడు. తెలుగులో వర్కౌట్ అయినట్లుగా నాని సినిమాలు మిగతా భాషల్లో వర్కౌట్ అవ్వడం లేదు.
కొన్నేళ్ల నుంచి విజయాలనే చూస్తున్న నాని.. ఇతర భాషల్లో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. ఆయన పాన్ ఇండియా కల నెరవేరుతుందా అనేది అభిమానుల సందేహం. ఇప్పుడు హిట్ 3 ని కూడా పాన్ ఇండియా మూవీ గానే నాని రిలీజ్ చేస్తున్నాడు. అందుకోసమే చెన్నై, బెంగుళూరు ఇలా ప్రతిచోటా సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.
మరి నాని పాన్ ఇండియా కల ఈ హిట్ 3 అయినా తీరుస్తుందా, హిట్ 3 తో నాని పాన్ ఇండియా హీరోగా మారుతాడా అనేది జస్ట్ వెయిట్ అండ్ సి..!