కోలీవుడ్ యాక్ట్రెస్ శృతి హాసన్ ఈమధ్యన తెలుగు సినిమాలు తగ్గించింది. కమ్ బ్యాక్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు ఒప్పుకున్న శృతి హాసన్.. ఈమధ్యన చేతిలో ఉన్న ఒక్క తెలుగు సినిమా డెకాయిట్ నుంచి కూడా తప్పుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో శృతి హాసన్ తన తల్లి తండ్రులు విడిపోయి డివోర్స్ తీసుకున్నాక తను లైఫ్ లైసెన్స్ నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.
గతంలోనూ చాలాసార్లు ఈ విషయంపై మాట్లాడిన శృతి హాసన్ తాజాగా మా పేరెంట్స్ కమల్-సారిక విడాకుల తర్వాత ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు, అప్పట్లో నా పేరెంట్స్ విడిపోవడం చాలా బాధగా అనిపించేది, ఆ తరవాత చెన్నై నుంచి ముంబై కి షాఫ్ట్ అయ్యాము, అప్పటివరకు లగ్జరీ లైఫ్, ఆ తర్వాత సాధారణ జీవితం గడిపాను, ఒకప్పుడు బెంజ్ లో తిరిగిన నేను తర్వాత లోకల్ ట్రైన్స్ లో తిరిగాను.
ఒకేసారి రెండు రకాల లైఫ్ లని చూసాను, ఇండస్ట్రీలోకి రాకముందు అమ్మతో ఉన్న నేను సినిమాల్లోకి వచ్చాక నాన్నతో ఎక్కువ ఉన్నాను, మ్యూజిక్ నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్ళాను, ఆతర్వాత నటిగా గుర్తింపు తెచ్చుకున్నాను, స్వతంత్రంగా ఆత్మవిశ్వసంతో లైఫ్ ని కొనసాగిస్తున్నాను అంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది.